PRATHIDWANI సంక్షేమ పథకాల ఏరివేత వెనుక ప్రభుత్వ ఎజెండా ఏంటి - సంక్షేమ పథకాలు తొలగింపు
ఆర్ధికభారమా.. అశాస్త్రీయ కొలమానమా.. కారణమేదైతేనేమి... సంక్షేమపథకాల లబ్దిదారుల ఏరివేత ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. వెలుగులు ప్రసరించాల్సిన అవ్వాతాతల కళ్ళల్లో కన్నీరు ప్రవహిస్తోంది. ప్రభుత్వ తీరుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆవేదనతో రగిలి పోతున్నారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్నది వడబోతనా.. ఏరివేతనా.. అర్హతలున్నా పథకాలు అందివ్వలేని దివాళాకోరుతనమా.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోన్న సాకులేంటి.. ప్రభుత్వ ప్రచార సోకులకు నిధులమాటేంటి.. దీనివెనుక ప్రభుత్వ ఎజెండా ఏంటి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST