PRATHIDWANI దేవదాయశాఖపై ఇన్ని విమర్శలు ఎందుకు - పూజల ధరలు పెంపు
తనివి తీరా స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకొని, పూజలు చేయించుకోవాలనుకునే భక్తులు.. ఒకటికి 2సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ప్రత్యేక దర్శనం, పూజలు లేకుండా దూరం నుంచే నమస్కరించుకొని వచ్చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు అధికారులు. రాష్ట్ర ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజల ధరలు భారీగా పెరిగిన ఫలితం ఇదని... భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీశైలం, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానాల ఉదంతాలే అందుకు నిదర్శనం అంటున్నారు. ఈ కారణంగానే.. భక్తుల నుంచి వీలైనంత రాబట్టు కోవాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానంగా ఉండాల్సిన దేవదాయశాఖ ఎందుకింత విమర్శల జడి ఎదుర్కొంటోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST