Prathidwani: సర్వే సంస్థలు, కన్సల్టెంట్లతో ప్రశ్నార్థకంగా భవిష్యత్..! - ysrcp political status
Prathidwani: భావోద్వేగాలు, బలహీనతలతో జాతి భవిష్యత్‌నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి సర్వే సంస్థలు, కన్సల్టెంట్లు.. కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన విషయం ఇది. 2017లో వైకాపా తరఫున ఐప్యాక్ రాక తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాళ్లది ఏముంది.. ప్రశాంత్ కిషోర్ లాంటి వారు డబ్బులు తీసుకుని సలహాలు ఇస్తారు. కొంతకాలం తర్వాత మరో పార్టీ కోసం మరో రాష్ట్రానికి వెళ్లిపోతారు. కానీ వారు చేసే ప్రచారాల ప్రభావం ప్రజలపై, రాష్ట్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక ముఖ చిత్రంపై ఎలా ఉంటోంది ? ఇలాంటి వాటిని నమ్మడం వల్ల కలిగే అనర్థాలేమిటి ? సున్నిత సమాచారం సైతం వారికెలా వెళుతోంది ? విభజించు పాలించు సూత్రంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారా? ఇలానే కొనసాగితే రాష్ట్రం పరిస్థితి ఏంటి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఎ. శ్రీనివాస రావు, ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ జి. ఈశ్వరయ్య పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.