Prathidwani: నిధుల లేక పంచాయతీలు కటకట.. సర్పంచ్‌ల కష్టాలు సర్కార్కు పట్టవా..? - Panchayat funds in andhra pradesh
Prathidwani: రాష్ట్రంలో పంచాయతీలు, సర్పంచ్‌ల అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దదిక్కుగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే దిక్కుతోచని స్థితిలో పడేస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి సర్పంచులది. ఏపీలో పంచాయతీల నిధులు పక్కదారి పడుతున్నట్లు స్వయానా ఆ శాఖకు చెందిన కేంద్రమంత్రే పార్లమెంట్‌లో ఎప్పుడో ప్రకటించారు. ఫలితంగానే.. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బుల్లేవ్ మహాప్రభో అని సర్పంచులు జోలె పట్టి భిక్షాటనలు చేసిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందే ఉన్నాయి. సాక్షాత్తూ అధికార పార్టీ మద్దతుదారులైన సర్పంచ్‌లు కూడా చెప్పులతో చెంపలేసుకున్న దృశ్యాలను మనం చూశాం. ఇప్పుడు అదే సర్పంచ్‌లు రోడ్లపైకి వచ్చి అరగుండ్లు, అర మీసాలతో తమ ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అసలు రాష్ట్రంలో పంచాయతీలు, సర్పంచులకు ఎందుకీ కష్టం? సర్పంచ్‌ల సంతకం, తీర్మానం లేకుండా నిధులను ఎలా తీసుకుంటారు? అసలు మొత్తంగా ప్రస్తుతం పంచాయతీలకు ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటి? వాటిపై ప్రభుత్వాల నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటోంది? పంచాయతీలు ఈ గండం నుంచి గట్టెక్కాలన్నా.. నిధుల విషయంలో స్వయం నిర్ణయాధికారంతో ఉండాలన్న శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.