ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

prathidwani.. భాజపాను ఎదుర్కొనేందుకే ప్రాంతీయ పార్టీల కొత్త పొత్తులా?

By

Published : Aug 10, 2022, 9:02 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

జాతీయ రాజకీయాల్లో అధికార భారతీయ జనతా పార్టీకి మి‌త్రపక్షాల నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బిహార్‌లో మిత్రపక్షం JDU అధికార NDAకు దూరమయ్యింది. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న RJDతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు మహారాష్ట్రలో శివసేన, పంజాబ్‌లో అకాళీదల్‌ కూడా ఇలాగే NDA నుంచి బయటకు వచ్చేశాయి. అయితే... తెరవెనుక భాజపా అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం వల్లనే వెళ్లిపోతున్నట్లు మిత్రపక్షాలు ఆరోపిస్తుంటే... స్వార్థ రాజకీయాలతోనే ప్రాంతీయ పార్టీలు కూటమిని వీడుతున్నాయని భాజపా అంటోంది. అసలు NDA కూటమిలో భాగస్వామ్య పార్టీలు ఎందుకు ఇమడలేక పోతున్నాయి? అప్పటివరకూ కత్తులు దూసుకున్న అధికార-ప్రతిపక్ష పార్టీలు వెంటనే ఎలా దోస్తీకి సిద్ధమవుతున్నాయి? భాజపాను ఎదుర్కోవడమే లక్ష్యంగా దేశంలో ప్రాంతీయ పార్టీలు మళ్లీ కొత్త పొత్తులకు సిద్ధమవుతున్నాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details