PRATHIDWANI: వరదల బీభత్సం.. కలవరపెడుతున్న ప్రాజెక్టుల భద్రత - projects
వరదల బీభత్సం.. జనజీవితాల్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఆదిలాబాద్ నుంచి ధవళేశ్వరం వరకు ప్రళయ గోదావరి మిగిల్చిన కష్టం కళ్లకు కడుతూనే ఉంది. ఈ సందర్భంగానే అందరి నుంచి వ్యక్తం అవుతున్న ఆందోళన ప్రాజెక్టుల భద్రత, నిర్వహణ లోపాల గురించి. ఇటీవల సంవత్సరాల్లో వరదల సమయంలో ఎదురైన అనుభవాలు, ప్రస్తుతం జలాశయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు కలవర పెడుతున్నాయి. ఒకవైపు వాతావరణ మార్పులతో 60-70 రోజుల్లో కురవాల్సిన వర్షాలు 20-30 రోజుల్లోనే పడుతున్నాయి. తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు ఒక్కసారిగా ముంచేస్తున్నాయి. ప్రస్తుతం చూస్తోన్న విలయం కూడా అదే. ఇటు కడెం నుంచి ధవళేశ్వరం వరకు.. అటు జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఈ విషయంలో దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇవే. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST