PRATHIDWANI: పోలవరం నిర్మాణం ఆలస్యానికి కారణమేంటి? - ఏపీ వార్తలు
Prathidwani: ఒక అడుగు ముందుకు - నాలుగు అడుగులు వెనక్కు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి... పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి ఇది. గడువులు మీద గడువులు దాటి పోతున్నాయి. ప్రాజెక్టు పూర్తయ్యే దారి మాత్రం కనిపించడం లేదు. నీరిచ్చేది ఎప్పుడు అంతుబట్టడం లేదు. కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటు చూసినా... ప్రశ్నలే. ముంపు వివాదాలు, నిర్వాసితుల వెతలు, సాంకేతిక సమస్యలు... ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది ఆ జాబితా. ఈ పరిస్థితుల్లోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది దేశ సర్వోన్నత న్యాయ స్థానం. ముంపు సమస్యల పరిష్కారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని.. ఈ నెలలోనే ప్రభావిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు జాతీయ ప్రాజెక్టుల డైరక్టర్ నుంచి పోలవరం తొలిదశపై కసరత్తు మొదలైన కబురు అందింది. అసలు పోలవరం ఎందుకింత ఆలస్యం అవుతోంది? ప్రాజెక్టు పూర్తయ్యే దారేది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST