Prathidwani: పేదల పక్షపాతిగా చెప్పుకునే జగన్‌కు ప్రజల బాధలు పట్టవా..! - Petrol prices in AP
Prathidwani: నిన్న ఉన్న ధర.. ఈ రోజు ఉండడం లేదు. బండి తీసి.. పెట్రో బంకుల వైపు వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. ఈ విషయంలో దేశంలోనే నంబర్-1 మన ఏపీ. మీడియా, ఆర్థిక విశ్లేషకులు ఈ మాట అంటే కస్సుమంటుంది జగన్ సర్కారు. కానీ ఇప్పుడు ఈ మాట చెబుతోంది స్వయంగా కేంద్ర ప్రభుత్వం. అది కూడా పార్లమెంట్‌లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా. ఏపీలో పెట్రోల్ లీటరుకు 111.87 రూపాయలు, డీజిల్ 99.61 రూపాయలుగా ఉన్నట్లు పార్లమెంటుకు తెలిపింది కేంద్రం. మరి జగనన్న ఈ పెట్రోమంట పథకంలో బిక్కచచ్చి పోతున్న సామాన్యుడి కష్టాల్ని పట్టించుకునేది ఎవరు? పేద మధ్య తరగతి ఉపాధి, నిత్యావసరాలపై పెట్రో ధరలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి. పేదల పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ వీరి బాధలు పట్టించుకుంటున్నారా? గుదిబండలా మారిన పెట్రో ధరల వల్ల.. సమాజంలో ఆటోరిక్షాలు, క్యాబ్‌ల వంటి స్వయం ఉపాధి నుంచి సరకు రవాణ రంగం వరకు ఏయే వర్గాల వారిపై ఎలాంటి ప్రభావం పడుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.