PRATHIDWANI: నిరుద్యోగుల ఎదురుచూపులకు ముగింపు ఎప్పుడు? - ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ రాత పరీక్షల తేదీలు ప్రకటించే విషయంలో తీవ్ర జాప్యం చేస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసి, పరీక్షలు రాసేందుకు నిరీక్షిస్తున్నారు. సకాలంలో పరీక్షలు జరపకపోతే అభ్యర్థులు విలువైన సమయాన్ని, భవిష్యత్తును కోల్పోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో అసలు ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఆలస్యానికి కారణమేంటి? నిరుద్యోగుల ఎదురుచూపులకు ముగింపు ఎప్పుడు? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST