PRATHIDWANI: ఆదాయంపై దృష్టి.. రైళ్లలో డైనమిక్ ఛార్జీలు..! - rail charges equal to flight charges
రైల్వేల్లో రాయితీలను పక్కన పెడుతున్న ప్రభుత్వం... ఇప్పుడు డైనమిక్ ఛార్జీల విధానం అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. రద్దీ మార్గాల్లో కొన్ని రైళ్లను ఎంచుకుని టికెట్ల ధరలను పెంచుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విమాన టికెట్ల అమ్మకాల్లో అమలు చేస్తున్న ఈ డైనమిక్ ఛార్జీల విధానాన్ని ఇప్పుడు రైల్వే సర్వీసులకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సామాన్యులకు భరోసాగా ఉన్న రైలు ప్రయాణాలు ఇకపై ఖరీదైన అంశంగా మారిపోనున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేల్లో డైనమిక్ ఛార్జీల వల్ల చోటుచేసుకునే పరిణామాలేంటి? సామాన్య ప్రయాణికులకు టికెట్ల ధరలు అందుబాటులోనే ఉంటాయా? ఆదాయంపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వం.. సౌకర్యాల కల్పనపై తీసుకుంటున్న చర్యలేంటి?
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST