PRATHIDWANI గాలిలో దీపంలా ఉద్దానం కిడ్నీ బాధితులకు వైద్యం - ఉద్దానం వార్తలు
ఉద్దానం కిడ్నీ బాధితులకు వైద్యం గాలిలో దీపంలా మారింది. అందనంత దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు అవస్థల పాలవతున్నారు. పీహెచ్‌సీల్లో అరకొరగా ఇస్తున్న మందులు, ఇంజెక్షన్లతో కిడ్నీ సమస్యలు మరింత ముదిరిపోతున్నాయి. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యాల కల్పన హామీలు బుట్టదాఖలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేలాది మంది ఉద్దానం కిడ్నీ బాధితులకు ముంచుకొస్తున్న ముప్పు ఏంటనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST