ఆంధ్రప్రదేశ్

andhra pradesh

prathidwani

ETV Bharat / videos

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం - అప్పులు చేస్తూ సలహాదారులను నియమించుకోవడం ఎందుకు?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 10:00 PM IST

Prathidwani: మింగ మెతుకులేదు.. మీసాలకు సంపంగి నూనే కావాలన్నడట వెనకటికి ఎవరో. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీరు, సలహాదారుల ప్రహసనానికి అతికినట్లే సరిపోతుంది ఆ మాట. ఒకవైపు రాష్ట్రంలో రోడ్లు వేయడానికి, కనీసం వాటి మరమ్మతులకు కూడా చిల్లిగవ్వలేదు. ఏ నెల చూసినా జీతాలు, పింఛన్లకు వెదుకులాట. అప్పు చేస్తే తప్ప పూడగడవని దుస్థితి. ఈ స్థితిలోనూ ప్రభుత్వానికి సలహాదారులు కావాల్సి వచ్చారు. ఒకరో ఇద్దరు కాదు.. డజన్ల కొద్దీ సలహాదారులు జనం సొమ్ముతో జల్సా చేసుకుంటున్నారు. ఈ డబ్బులెవరివి? ఈ భారం ఎవరి మీద పడుతోంది? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమంది సలహాదారులు ఉన్నారు? వారు ఎవరు? వారి జీతాలు ఎవరు చెల్లిస్తున్నారు? వారి వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం?  ప్రభుత్వ సలహాదారులపై హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సలహాదారులు.. రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం సలహాదారుల్ని నియమిస్తూనే ఉంది. అసలు ఈ ప్రభుత్వంలో ఎందుకు చలనం ఉండట్లేదు? ఇదీ నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details