PRATHIDWANI: పేర్ల మార్పు వెనక ఉద్ధేశాలేంటి? ఇలా ఎందుకు చేయాల్సి వస్తోంది? - కర్తవ్య పథ్
Prathidwani: కర్తవ్య పథ్. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్‌కు వరకు ఉన్న చారిత్రక మార్గానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయించిన పేరు ఇది. నిన్నటి వరకు అది రాజ్‌పథ్. ఆ ఒక్కటే కాదు. దేశంలోని అనేక చారిత్రకప్రదేశాలు, మార్గాలకు వలసకాలం నాటి పేర్లు మార్చుతామని ఇప్పటికే ప్రకటించింది కేంద్రం. ఇదే సమయంలో సైనిక దళాల పతకాలు, చిహ్నాల్లోనూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్న ఆజాదీ కా అమృత మహోత్సవాలకు ముందు నుంచే... ఇందుకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. ఈ మార్పుల వెనక ప్రభుత్వం ఉద్ధేశాలేమిటి? పేర్లు, చిహ్నాలు, పతకాల్లో ఇలా ఎందుకు మార్పులు చేయాల్సి వస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST