Prathidwani: ఎన్నికల ముందు జగన్ పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయి ?
Prathidwani: ఎన్నికల ముందు పలికిన బీరాలేమయ్యాయి ? ఆ రంకెలు.. మెడలు వంచుతానన్న ప్రగల్బాలు ఏమయ్యాయి ? అధికారంలోకి వచ్చాక బెల్లం కొట్టిన రాయిలా ఎందుకు మారి పోయారు ? విభజన హామీల సాధన.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఎంతోమంది ప్రజల్లో నలుగుతున్న ప్రశ్నలు ఇవి. కేంద్రం మెడలు వంచుతానన్న పెద్ద మనిషి జగన్.. దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల ముందు తలదించుకుని, విన్నవించుకోవడం తప్ప, గట్టిగా ఎందుకు నిలదీయడం లేదనేది ఎవరికీ అంతు బట్టడం లేదు. నాలుగేళ్లుగా కేంద్ర పెద్దల దగ్గర వినయ, విధేయతలతో మెలుగుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు గాలి కొదిలేసిన వైకాపా నాయకులు రాబోయే రోజుల్లోనైనా పెదవి విప్పే ధైర్యం చేస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు కలగడం లేదు. మరి ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, దళిత, బహుజన జేఏసీ నాయకుడు పోతుల బాలకోటయ్యలు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.