PRATHIDWANI: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఎందుకు లోపభూయిష్టంగా మారింది? - పులిచింతల
Prathidwani: ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకదాని వెంట మరొకటి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఫలితం నిండు కుండల్లాంటి ప్రాజెక్టులకు చిల్లులు పడుతున్నాయి. అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోయిన భయానక దృశ్యం కళ్ల ముందే మెదులాడుతోంది. పులిచింతలలో విరిగి పడిన డ్యామ్ గేట్లు చేసిన మరో హెచ్చరికా అలానే ఉంది. ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టులో మరో గేటు దెబ్బతిని భారీగా నీరు సముద్రం పాలైంది. అసలు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఎందుకని ఇంత లోపభూయిష్టంగా మారింది? అన్నం పెట్టే అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే ఆ ప్రాజెక్టులకు నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇస్తోందా? కీలకమైన గేట్ల నిర్వహణలోనే ఇన్ని ప్రమాదాలు దేనికి సంకేతం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST