Prathidwani: ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు.. యథేచ్ఛగా ఇసుక దోపిడీ - ap latest news
Prathidwani : రాష్ట్రంలో ఇసుక అంతా ఏం అవుతోంది? ఇసుక రీచ్‌ల్లో స్వైర విహారం చేస్తున్న తోడేళ్ల గుంపు ఎవరు? జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్న ఇసుక అక్రమాల నేపథ్యంలో అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. పిండారీలను మించిపోయిన రీతిలో వ్యవహరిస్తున్నఆ దోపిడీదారుల్ని అడ్డుకోవడం అధికార యంత్రాంగానికి ఎందుకు చేతకావడం లేదు? ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణా.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతూ ఉంటే.. నిత్యం వందలాది లారీల్లో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక సంగతి ఏమిటి? డొంక తిరుగుడు వివరణలు మాని వనరుల్ని పరిరక్షించడానికి తక్షణం ఏం చేయాలి? విపక్షాలు రేవులకే వెళ్లి వాస్తవాల్ని ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ రాష్ట ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రి జగన్‌కు తెలియవా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చేపట్టింది. ఈ చర్చలో ఆర్పీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి. వెంకటేశ్వర్లు, ఆర్బీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు.