సెమీఫైనల్ లాంటి పోరులో పట్టభద్రుల తీర్పు దేనికి సంకేతం..? - ప్రతిధ్వని వివరాలు
Prathidhwani: క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికారపక్షానికి ఊహించని షాక్ ఇచ్చాయి. చావోరేవో పోరాటంలో విపక్షాలకు కొండంత అండ, కొత్త ఊపిరులు అందించాయి. స్థానిక సంస్థలు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో ముందంజలో ఉన్న అధికార వైసీపీ.. గ్రాడ్యుయేట్ స్థానాలకు వచ్చే సరికి ఎందుకని వెనకబడింది? అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల వ్యవధి ముందు... సెమీఫైనల్ లాంటి పోరాటంలో పట్టభద్రుల తీర్పు దేనికి సంకేతం. ఇటు రాయలసీమ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు... అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నాడి అధికారపార్టీకి ఏం చెబుతోంది. 9 జిల్లాల్లో, 108 నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓటర్లు ఇచ్చే ఈ తీర్పు మార్పు సంకేతం అనుకోవచ్చా... అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం ఉంటుందా.. ఈ ఎన్నికల ప్రభావం వైసీపీ, టీడీపీ, వారి కేడర్ పైనా ఎలా ఉండబోతోంది. వైసీపీ ఎందుకు ఇంత వ్యతిరేకత కూడగట్టుకుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.