ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani

ETV Bharat / videos

Prathidwani: ప్రభుత్వ ఉద్యోగుల పింఛను పోరాటం మళ్లీ ఉద్ధృతం కాబోతుందా? - ఓపీఎస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 10:17 PM IST

Prathidhwani: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పింఛను పోరాటం మళ్లీ ఉద్ధృతం కాబోతోందా? తాము అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని అనేక సభల్లో హామీ ఇచ్చిన జగన్ .. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత జీపీఎస్‌ను ఎందుకు తెరపైకి తీసుకుని వచ్చారు?  సీపీఎస్‌ కన్నా జీపీఎస్‌ గొప్పగా ఉంటుందని కొంతకాలంగా ఉద్యోగుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతిపాదనలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది?  రాష్ట్రంలో సీపీఎస్ రద్దు... ఓపీఎస్ సాధనపై అసలు ఉద్యోగసంఘాల మధ్యన ఐకమత్యం ఉందా?  ఉవ్వెత్తున ఎగసిన చలో విజయవాడ స్థాయిలో మళ్లీ ఎందుకు ఉద్యమాలు జరగలేదు?  సమస్యలు, డిమాండ్ల సాధనపై ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అయితే జీపీఎస్‌ ప్రతిపాదనను బలంగా ముందుకు తెస్తున్న ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తామన్న మాట మాత్రం ఎక్కడా అనడం లేదు. అంటే ఇకపై సీపీఎస్, జీపీఎస్ రెండు విధానాలూ ఉంటాయా?  వారంలో సీపీఎస్‌ రద్దుపై మడమ తిప్పడంపై ప్రశ్నలకు సమాధానంగా అప్పట్లో తెలియక హామీ ఇచ్చామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. అంత తెలియకుండా ఎలా హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వారు చెబుతున్న మాటలు, జీపీఎస్ బాగు అని ఇస్తున్న హామీని నమ్మేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details