Prathidwani: నాలుగేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రవాణా రంగం - transport industry news
ఇప్పటికే.. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే.. ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్ ధరలు అత్యధికంగా ఉండటంతో గగ్గోలు పెడుతున్న సరకు, ప్రయాణికుల రవాణా వాహనదారులకు ప్రభుత్వం పన్ను పెంపు రూపంలో మరో షాక్ ఇచ్చింది. అభ్యంతరాలు పట్టించుకోకుండా... త్రైమాసిక పన్ను 25 నుంచి 30% వరకు పెంచుతూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటా 250 కోట్ల బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పొరుగు రాష్ట్రాల వాహనాలతో పోటీ పడలేక పోతున్నామని, త్రైమాసిక పన్ను పెంచి ఇంకా భారం వేయవద్దని లారీ యజమానుల సంఘాలు, ఇతర సంఘాలు.. మొర పెట్టుకున్నా అవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. అసలు రాష్ట్రంలో రవాణ రంగం పరిస్థితి ఏమిటి? గడిచిన 3, 4 ఏళ్లుగా ఎందుకీ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు, అఖిల భారత రవాణ కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్యలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.