PRATHIDWANI: వరుస ప్రమాదాలతో కార్మికుల భద్రతకు భరోసా ఏది?
ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు.. ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విశాఖ అచ్యుతాపురం సీడ్స్ దుస్తుల పరిశ్రమలో విషవాయువులు విడుదలై 150మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే.. స్పృహకోల్పోయి అచేతనంగా పడిపోయారు. రెండునెలల వ్యవధిలోనే అదే పరిశ్రమలో మరోసారి ప్రమాదం జరగడంతో.. గతంలో ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం దర్యాప్తు నివేదికలు బయటపెట్టకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకొన్నారా? వరస ప్రమాదాల నేపథ్యంలో కార్మికుల భద్రతకు భరోసా ఏది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST