PRATHIDWANI: వరద ఉద్ధృతి అంచనా వేయడంలో లెక్క తప్పిందా..? ఇప్పుడేం చేయాలి..! - villages facing problems
భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న జనం.. సరైన ఆహారం, తాగునీరు కూడా లభించక అవస్థలు పడుతున్నారు. గూడు కోల్పోయిన ప్రజలతో సహాయ శిబిరాలు కిక్కిరిసిపోతున్నాయి. తాత్కాలిక షెల్టర్లలో తలదాచుకున్న బాధితులు ప్రభుత్వ సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. అక్కడక్కడా అధికారులు బియ్యం, పాలు అందిస్తున్నా.. వంట చేసుకునేందుకు గ్యాస్ సిలిండర్లూ దొరకని దుస్థితి నెలకొంది. బహిరంగ ప్రదేశాల్లో, టార్పాలిన్ కవర్ల కింద, రాత్రి వేళ చీకటిలోనే తలదాచుకుంటున్న పరిస్థితికి కారణమేంటి? వరద ఉద్ధృతిని అంచనా వేయడంలో ప్రభుత్వం ఎక్కడ లెక్కతప్పింది? జల దిగ్బంధంలో ఉన్న ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఇప్పుడేం చేయాలి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST