PRATHIDWANI మత్స్యకారుల జీవితాల్లో మార్పు ఎప్పుడు
చేప చిక్కదు... ఉపాధి దక్కదు. ఇది మాత్రమే కాదు రాష్ట్రంలో కొంతకాలంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. జెట్టీల లేమి నుంచి మత్స్యకార భరోసా అందకపోవడం వరకు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే అవుతుంది ఆ జాబితా. అసలు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలోని గుజరాత్, మహారాష్ట్ర తీరాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు పొట్ట చేత బట్టుకుని వలస వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? మత్స్యకారుల సామాజిక, ఆర్థిక జీవన ముఖచిత్రాన్ని కాపాడడంలో ప్రభుత్వం చర్యలు ఎంత వరకు అక్కరకు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో వారు కోరుకుంటున్న సాంత్వన ఏమిటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST