PRATHIDWANI బయోమెట్రిక్ విధానం ఉండగా ముఖ హాజరు ఎందుకు - ఫేషియల్ అటెండెన్స్
Prathidwani రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు యాప్‌లో ఫేషియల్ అటెండెన్స్ నిబంధన పెను దుమారానికి దారి తీసింది. అకస్మాత్తుగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధనపై తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. చాలాచోట్ల ఉపాధ్యాయులు మఖ హాజరు నమోదు కోసం సెల్‌ఫోన్లతో గంటల తరబడి కుస్తీలు పట్టారు. వీక్ నెట్‌వర్క్, సర్వర్ జామ్, ఫోటో లోడింగ్ ఫెయిల్యూర్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. అదీగాక సొంతఫోన్లలో హాజరు నమోదు చేయాలన్న విధానాన్నే ఉపాధ్యాయ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బోధనేతర సిబ్బందిని, ప్రత్యేక డివైస్‌లను, డేటాను అందించాలని స్పష్టం చేస్తున్నారు. అసలు బయోమెట్రిక్ విధానం అందుబాటులో ఉండగా ముఖ హాజరు అవసరం ఏమొచ్చింది. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లేవనెత్తిన ముఖ హాజరు సమస్యలకు పరిష్కారం ఏంటనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST