PRATHIDWANI: బీసీలకు వైసీపీ ఇచ్చిన హామీలేంటి..? ఎన్ని అమలు చేశారు? - PRATHIDWANI on development of BCs
బీసీలు అంటే.. బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్ క్లాసులు. వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తరచు చెప్పేమాట ఇది. మరి.. వారి ప్రభుత్వం చేతల్లో ఆ స్ఫూర్తి ఎంత మేరకు కనిపిస్తోంది? నాలుగు సంవత్సరాల్లో బడుగుల ఉద్ధరణకు ఏం చేశారు? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలు, ఆయా సమూహాల ప్రతినిధులు, మేధావుల నుంచి వస్తోన్న ప్రశ్నలు ఇవి. అసలు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ మేనిఫెస్టోలో ఏమేం హామీలు ఇచ్చారు? వాటిల్లో ఎన్ని అమలు చేశారు? పేరుకు ఘనంగా ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల ద్వారా వారికి జరిగిన మేలెంత? ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు కావాల్సిందేమిటి? రాష్ట్రంలో వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ మేనిఫెస్టోలో ఏమని హామీలు ఇచ్చింది? వాటిల్లో ఎన్ని అమలు చేసింది? అన్నింటికంటే ముఖ్యమైనది బీసీ జన గణన డిమాండ్. ఈ విషయంలో వైసీపీ మేనిఫెస్టోలోనూ చెప్పారు. బిహార్ వంటి రాష్ట్రాలు ఆ కార్యక్రమం ప్రారంభించాయి. ఇక్కడ ఎప్పుడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.