Prathidwani: ఎన్నికలకు ముందు జగన్ దళితులకు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? - ఎన్నికలకు ముందు జగన్ దళితులకు ఏం చెప్పారు
Pratidwani: నా ఎస్సీలు, నా ఎస్టీలు.. ప్రతిసందర్భంలో, ప్రతి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెబుతున్న మాట ఇది. మరి వాస్తవంలో.. నాలుగేళ్లు అయినా వైసీపీ ఏలుబడిలో ఆ దళితులకేం ఒరిగింది? ఈ ప్రశ్నకు సమాధానంగా... "ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య" అన్న సామెత అతికినట్లు సరిపోతుందని వాపోతున్నాయి దళిత సంఘాలు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు.. వాటి అమల్లో అలసత్వంతో పాటు.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, జగన్ ప్రభుత్వ తీరే అందుకు ఉదాహరణ అంటున్నారు. అసలు ఎన్నికలకు ముందు జగన్ దళితులకు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? జగన్ తన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఎంతమంది ఎస్సీ, ఎస్టీలకు ఎంత భూమిని పంపిణీ చేశారు? రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులకు సంబంధించి ప్రతిపక్ష నేతగా జగన్ ఏ చెప్పారు..? విశాఖలో డాక్టర్ సుధాకర్ బాబు ఉదంతం నుంచి... ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ హత్య, కడపలో పశువైద్యుడిని దారుణంగా హతమార్చడం వరకు ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.