PRATHIDWANI: 'ఒకే ఒక్క ట్రైబ్యునల్'.. వివాదాల పరిష్కారాల్లో జరిగే మార్పులేంటి?
అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టానికి కేంద్రం సవరణలు చేయనుంది. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఇప్పుడు కొన్ని సవరణలు చేసి, రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న జల వివాదాల ట్రైబ్యునళ్ల స్థానంలో ఒకే ఒక్క ట్రైబ్యునల్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ బిల్లు పార్లమెంట్ అమోదం పొందితే దేశంలో నాలుగున్నరేళ్ల కాలపరిమితితో జల వివాదాలపై ట్రైబ్యునళ్లు తుది తీర్పులు వెలువరించేందుకు మార్గం సుగమం అవుతుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం దేశంలో ఏఏ నదులపై జల వివాదాలు కొనసాగుతున్నాయి? ఒకే ఒక్క ట్రైబ్యునల్‌తో వివాదాల పరిష్కార ప్రక్రియలో చోటు చేసుకునే మార్పులు ఏంటనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST