PRATHIDWANI చరిత్రాత్మక విజయంతో బీజేపీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి - గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం
రానున్న సాధారణ ఎన్నికలకు ముందు అందరి దృష్టీ కేంద్రీకృతమైన గుజరాత్ పోరులో.. భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక, చిరస్మరణీయ విజయం అందుకుంది. గుజరాత్ చరిత్రలోనే ఈసారి అత్యధిక సీట్లు సొంతం చేసుకుంది. పోటెత్తిన ఓట్ల సునామీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పూర్తిగా డీలా పడగా... అక్కడ కొత్తగా రంగప్రవేశం చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ తక్కువ సీట్లే గెలిచినా.. చెప్పుకోదగ్గ ఓట్లు మాత్రం సాధించగలిగింది. చేతిలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్ చేజారినా.. గుజరాత్‌లో సాధించిన భారీ విజయం తర్వాత భాజపా తదుపరి అడుగులు ఎటువైపు.. ఆ పార్టీ అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంది.. తమ చిరకాల స్వప్నమైన అసేతు హిమాచలం కాషాయవర్ణ శోభితం కోసం ప్రారంభించిన రాజకీయ అశ్వమేధం.. ఎలాంటి సమీకరణాలకు దారి తీయనుంది.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST