ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani Debate on Assigned Lands: అసైన్ట్ భూములపై విక్రయహక్కులు..! ప్రభుత్వం నిర్ణయం ఎవరికోసం..?

By

Published : Aug 7, 2023, 9:59 PM IST

Prathidwani_Debate_on_Assigned_Lands

Prathidwani Debate on Assigned Lands: భూమిలేని పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై విక్రయహక్కులు కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై దళితసంఘాల మండిపడుతున్నాయి. అసలు అసైన్డ్‌భూముల చట్టం ఏం చెబుతోంది? జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యపై లోతుగా, క్షుణ్ణంగా కోనేరు రంగారావు కమిటీ అధ్యయనం చేసి.. సిఫార్సులు చేసింది. అసైన్డ్‌ భూముల పరిరక్షణపై కీలక సూచనలు చేసింది.  జగన్ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే నడుచుకుంటోందా? అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి భూములు ఇస్తామని జగన్ చెప్పారు. అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించడం అంటే.. వారికి భూములు ఇవ్వడం అవుతుందా? ఉన్న భూములు అన్యాక్రాంతం అవ్వడానికి దారి తీస్తుందా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈ చట్ట సవరణ తేవడం వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? జగనన్న కాలనీల నిర్మాణం కోసమని.. ప్రభుత్వం వైసీపీ నాయకుల నుంచే వాస్తవ ధరల కంటే అధికధరలకు కొనుగోలు చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోపక్క బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టడం కూడా చూశాం. అసలు ప్రజాసంపద అయిన భూములను పరిరక్షించే విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

...view details