PRATHIDWANI: రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం అప్పులు చేస్తే ఏమవుతుంది? - ఏపీ అప్పులపై అంశంపై నేటి ప్రతిధ్వని
PRATHIDWANI: రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం అప్పులు చేస్తే ఏం అవుతుంది? ఆ రాష్ట్రాలతో పాటు దేశం కూడా నాశనం అవుతుంది. ఇదేదో ప్రతిపక్షాలు, గిట్టని వారి విమర్శ కాదు. స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ వేదికగా చేసిన ప్రకటన. ఆంధ్రప్రదేశ్ అప్పుల తిప్పలపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో దుమారం రేగుతున్న వేళ... మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.. ప్రధాని వ్యాఖ్యలు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమిటి? అప్పులు చేయడం వల్ల సగటు పౌరులపై ఎలాంటి ప్రభావం పడుతుంది. శ్రీలంక తరహా పరిస్థితులపై హెచ్చరికలు ఎందుకు ? అదే జరిగితే ఎలాంటి విపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? దిద్దుబాటు ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.