అమరావతిలో భూముల అమ్మక ప్రకటన అంతరార్థం ఏంటి?
PRATHIDWANI: అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి దేవుడెరుగు.. మరోసారి అక్కడ భూముల విక్రయ ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కొంతకాలంగా పరిస్థితులు అ అంటే "అమరావతి ”.. ఆ అంటే ఆ అమరావతి రైతుల "ఆవేదన" అన్నట్టుగా మారాయి. పైగా ఇప్పుడు రాజధానిని అభివృద్ధి చేయకపోగా అక్కడి భూములు విక్రయించి సొమ్ము చేసుకోవడానికి సిద్ధమైంది వైకాపా ప్రభుత్వం. ఏ ప్రాంతాన్ని అయితే ఎడారి.., శ్మశానం... ఇంకా ఏవేవో అంటూ అపకీర్తి, అపనమ్మకం పాలు చేయాలని చూశారో అదే ప్రాంతంలో భూముల్ని ఎకరా ఆరు కోట్ల రూపాయల వరకు విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకవైపు మూడు రాజధానుల వివాదం కోర్టులో నడుస్తోంది. అయినా త్వరలో చలో విశాఖ అంటున్నారు సీఎం. ఈ తరుణంలో భూముల అమ్మక ప్రకటన అంతరార్థం ఏమనుకోవాలి. మరోవైపు అలుపెరగని రైతుల ఆందోళనల మధ్యనే ప్రభుత్వ ఈ నిర్ణయాల్ని ఎలా చూడాలి.. రాజధాని ప్రాంత భూముల్ని అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి జేఏసీ కార్యాచరణ ఎలా ఉండనుంది అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.