Prathidhwani రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా.. లేక రౌడీ రాజ్యమా? - ఏపీలో జరుగుతున్న దాడులపై వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 10:15 PM IST
Prathidhwani: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా... లేక రౌడీ రాజ్యమా? ఒకటి కాదు రెండు కాదు... నాలుగున్నరేళ్లుగా క్రమం తప్పకుండా చోటుచేసుకుంటున్న ఘటనలు సంధిస్తున్న ప్రశ్నలివి. నిన్నటికి నిన్న... హారన్ కొట్టినందుకు కావలిలో విధుల్లో ఉన్న ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు కొందరు. అంతకు కొద్దిరోజుల ముందు.. పుంగనూరులో సైకిల్ యాత్ర చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన వారిపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడి దాష్టీకం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్లినా జిల్లాజిల్లాకో కథ ఉంది రౌడీ మూకల వీరంగానికి సంబంధించి. మరోవైపు అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ జగన్ మళ్లీ గెలిస్తే చంద్రబాబు చస్తారంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం? ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరిలో సాధారణంగా కలిగే ప్రశ్న ఇది. పైగా సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30ని గతంలో ఎన్నడూ లేనంత విస్తృతస్థాయిలో ఉపయోగిస్తున్న పోలీసింగ్‌లో ఎందుకీ పరిస్థితి? ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని.