Prathidhwani: ప్రజాధనం దుర్వినియోగం అంటే ఇది కదా... - ప్రజాధనం దుర్వినియోగం అంటే ఇది కదా వీడియోలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 9:37 PM IST
Prathidhwani: అధికార దుర్వినియోగం, ప్రజాధనాన్ని దోచిపెట్టడం అంటే ఎలా ఉంటుంది...? అచ్చం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులా ఉంటుంది. ముఖ్యమంత్రి సొంత పత్రిక సిబ్బందికి నేరుగా ప్రభుత్వ శాఖల్లో పోస్టులు... వేలు, లక్షల్లో జీతభత్యాలు. పార్టీ వందిమాగాదులకి సలహాదారులతో పాటు నేరుగా సచివాలయం, ముఖ‌్యమంత్రి కార్యాలయంలోనే పదవులు, లక్షల్లో జీతభత్యాలు. ప్రజాధనంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన వాలంటీర్ల వ్యవస్థ సొంత పార్టీ అవసరాలకే వినియోగం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా... రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా జగన్ సర్కారు లీలలు అనేకం అంటున్నాయి విపక్షాలు. ఇది కదా ప్రజాధనం దుర్వినియోగం అంటే? జనాలను పీడించి వసూలు చేస్తున్న పన్నులను సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. తర్వాత ఆ రంగులు మార్చారు. ప్రజధనాన్ని ఇలా ఇష్టానుసారం వృథా చేయడం దుర్వినియోగం కాదా? పచ్చిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నందుకు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.