కోడికత్తి కేసులో ఎందుకీ జగన్నాటకం? - కోడికత్తి కేసులో నిందితుడి వాదన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 10:11 PM IST
|Updated : Jan 19, 2024, 6:57 AM IST
Prathidhwani:జనుపల్లి శ్రీనివాసరావు, అలియాస్ కోడి కత్తి శ్రీనును ఎంతకాలం జైల్లో ఉంచుతారు? జగన్ అంటే ప్రాణమిచ్చే ఓ నిరుపేద దళిత యువకుడికే ఎందుకింత కష్టం? నిజానికి ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని ఇప్పటికే స్వయంగా జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పేసింది. అదే విషయం కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. కానీ అయిదేళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్న ఆ యువకుడికి కనీసం బెయిల్ కూడా లభించడం లేదు. కారణం, CM జగన్ కోర్టుకు రాకపోవడం. ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి, దయచేసి కోర్టుకు మాత్రం రండి అని శ్రీను తల్లి, అన్న, వారి తరఫున లాయర్లు , దళితసంఘాలు వేడుకుంటున్నా కోర్టుకు రావడానికి జగన్‌కున్న ఇబ్బందేంటి?
జగన్ అంటే ప్రాణమిచ్చే ఓ దళిత యువకుడు. పేదింటి బిడ్డ. జగన్ సీఎం కావాలని పరితపించిన కార్యకర్త. 5 ఏళ్లుగా జైలులో మగ్గుతుంటే, ముఖ్యమంత్రి జగన్ మనసు కరగట్లేదా? కేవలం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పటానికి ఏంటి ఆయనకున్న ఇబ్బంది? కోడికత్తి కేసులో ఎందుకీ జగన్నాటకం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.