ఆంధ్రప్రదేశ్‌లో జగనే మరోసారి అధికారంలో వస్తే..? - వై ఏపీ హేట్స్ జగన్ వీడియోలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2023, 9:24 PM IST
Prathidhwani: ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. అంటూ భారీస్థాయిలో ప్రచారం హోరెత్తిస్తోంది అధికార వైసీపీ. ఆర్థికవ్యవస్థతో మొదలు పెడితే... సామాజిక న్యాయం వరకు అన్నింటా మేమే ఉత్తమం, మా పాలనే ఉత్తమోత్తమం అంటూ.. ఊరూవాడ ఊదరగొడుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? జగన్ చెప్పినవన్నీ చేసి ఉంటే ప్రజల్లో జీవితాల్లో వచ్చిన మార్పు ఎంత? వైసీపీ ప్రచారం - ప్రజల సంతృప్తికి మధ్య పొంతన ఉందా? వైసీపీ చెబుతున్నవన్నీ నిజమే అయితే విపక్షాలు, ప్రజాసంఘాలు "వై ఏపీ హేట్స్ జగన్" అని మరో ప్రచారోద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జగన్ ఇంకోసారి గెలిస్తే ఏమవుతుంది?
ఆరోగ్య శ్రీ విస్తరణ, బకాయిలు చెల్లింపు, ఆరోగ్యఆసరా, ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమాలతో పాటు వైద్య సదుపాయాల్ని విస్తరిస్తున్నామంటోంది వైసీపీ. క్షేత్రస్థాయిలో అది కనిపిస్తోందా? విద్యారంగంలో నాడు-నేడు అంటున్న జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన మార్పులేంటి? ప్రమాణాలు, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రచారం - ప్రజల సంతృప్తికి మధ్య పొంతన ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.