చంద్రబాబుపై కేసులో ఆధారాలు ఎక్కడ ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 20, 2023, 10:17 PM IST
Prathidhwani: స్కిల్ కేసులో చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ తీర్పులో హైకోర్టు పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి? సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు నుంచి విజయవాడ, హైదరాబాద్, దిల్లీ ల్లోనూ ప్రెస్‌మీట్లలో సీఐడీ, ఏఏజీ ఎన్నో అరోపణలు చేశారు. మరి కోర్టుకు ఆ ఆధారాలు ఎందుకు ఇవ్వలేక పోయారు? చంద్రబాబు, తెలుగుదేశం నిధులు మళ్లాయన్న ఆరోపణలకు ఆధాలేవంది హైకోర్టు. అలాంటి ప్రాథమిక ఆధారం కూడా లేకుండా ఎలా అరెస్టు చేశారు? ఇంతకాలం ఎలా జైల్లో ఉంచారు? స్కిల్ కేసులో ప్రతిచోట కీలకంగా కనిపిస్తున్న అధికారులు ఎక్కడా తప్పు చేసినట్లు పేర్కొనని సీఐడీ వారికి అధిపతైన సీఎం చంద్రబాబు ఒక్కడే తప్పు చేశారని అసలెలా నిర్థరించి కేసుకట్టింది? స్కిల్ కేసులో సీఐడీ 30 రోజులకు పైగా విచారణ చేసినా, చంద్రబాబు తప్పు చేసినట్టు గానీ, స్కిల్ డెవలప్‌మెంట్‌కు నష్టం కలిగినట్టు, ఎలాంటి ఆధారాలు ఎందుకు చూపించలేక పోయింది? స్కిల్ కేసులో జగన్‌ప్రభుత్వం, ఏపీ పోలీస్ అనుసరించిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉందీ అనే అనుకోవాలా? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతనే ఇలా కనీస ఆధారాల్లేకుండా అరెస్టు చేసి, ఇన్ని రోజులు జైల్లో ఉంచి, ఇంతగా వేధించారు. ఇక ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, పోలీసుల చేతుల్లో సామాన్యుడి పరిస్థితేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.