రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎందుకీ దీన పరిస్థితి?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 10:33 PM IST
Prathidhwani: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో సర్కారు నిర్లక్ష్యం, అసమర్థతల్ని ప్రజల కళ్లకు కడుతూ, మరో సాగునీటి ప్రాజెక్టు గేటు కొట్టుకు పోయింది రాష్ట్రంలో. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగి పడింది. గతేడాది ఆగస్టులో ఇదే ప్రాజెక్టులో 3వ నంబర్ గేటు కొట్టుకు పోయింది. దానికి ఇప్పటికీ పూర్తి మరమ్మతులు చేయలేదు. ఇంతలోనే ఇలా.. మరో ప్రమాదం జరిగింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎందుకీ పతనావస్థ? గుండ్లకమ్మ ఒక్కటే కాదు, అన్నమయ్య డ్యామ్ నామరూపాల్లేకుండా పోవడం, పులిచింతల గేటు ధ్వంసం, పోలవరంలో డయాఫ్రం వాల్‌కి నష్టం, గైడ్‌బండ్ కుంగడం, నీటి లీకేజీలు వీటన్నింటికీ ఎవరు బాధ్యులు? ప్రాజెక్టుల్లో ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలు కనీస అవగాహన ఉందా? వాటి ప్రాధాన్యం, జరుగుతున్న నష్టాన్ని గుర్తిస్తున్నారా? రాష్ట్రంలో శ్రీశైలం, పులిచింతల, సోమశిల, కండలేరు, వెలిగోడు వంటి భారీ ప్రాజెక్టులతో పాటు 71 వరకు మధ్యతరహా, అనేక చిన్న ప్రాజెక్టులూ ఉన్నాయి. వాటి నిర్వహణ ఎలా ఉంది? ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని.