ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అండగా నిలిచి అడ్డంగా బుక్కైన అధికారుల పరిస్థితి ఏంటి ? - ప్రతిధ్వని వీడియోలు

🎬 Watch Now: Feature Video

Prathidhwani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 10:06 PM IST

Prathidhwani: తప్పు చేసిన అధికారులకు ముప్పు తప్పదా? అధికార పార్టీ అడ్డగోలు పనులకు అండదండగా నిలిచి అడ్డంగా బుక్కైన వారి పరిస్థితేంటిప్పుడు? రాష్ట్రంలో  ఐఏఎస్‌లుగా మారిన అఖిల భారత సర్వీసుల అధికారులపై కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చ ఇదే. ప్రతిరోజు వేలాదిమందితో నమస్కారాలు పెట్టించుకునే స్థానం నుంచి కోర్టుబోనుల్లో చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితీ దాటి పోయింది. చేతిలో అధికారం ఉందని.. ప్రభుత్వం చెప్పింది కదా అని.. 4 సంవత్సరాల 9 నెలలుగా సీఎం జగన్, వైసీపీ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళతామని రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు జరుగుతోన్న ప్రచారమే అందుకు కారణం. రాష్ట్రంలో బ్యురొక్రాట్లకు ఎందుకీ పరిస్థితి? డీజీపీ, సీఐడీ చీఫ్‌, ఇంటిలిజెన్స్ చీఫ్ ఇలా ఐపీఎస్‌లు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని అత్యున్నత సర్వీసు అధికారులకు తెలియదా? మరి ఏకపక్షంగా వింత వింత కేసులు పెట్టి అధికారపార్టీ ప్రయోజనాల కోసం పనిచేయటాన్ని వారెలా సమర్థించుకుంటారు?ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details