ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani

ETV Bharat / videos

Prathidhwani: కరవు, వలసలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? - కరువు పరిస్థితిపై ఏపీ ప్రతిధ్వని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 9:06 PM IST

Prathidhwani: వర్షాల్లేవు... కాల్వల్లో నీళ్లు లేవు... కరెంటు లేదు.. పంటల్ని బతికించుకునే మార్గం లేదు.. వలసల్ని ఆపే నాథుడు లేదు.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కరవు, వలసల తీవ్రత ఎలా ఉంది?   ఖరీఫ్‌లో 80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైందే 55 లక్షల ఎకరాలు. దీంట్లోనూ అనావృష్టికి తోడు ముందుచూపు లేని ప్రభుత్వ తీరుతో ఎంతమేర పంటలు దెబ్బతిన్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా 440కి పైగా మండలాల్లో కరవు తీవ్రంగా ఉంది. అయినా ప్రభుత్వం కరవు మండలాలు ఎందుకు ప్రకటించలేదు? అది చేసి ఉంటే రైతులకు ఎలాంటి మేలు జరిగేది?  కరవుకాటుతో అనేక జిల్లాల నుంచి వలసల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కర్ణాటకలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారూ కరవు వల్ల వలస వెళ్లినవారే. దీనికెవరు బాధ్యులు?  ఎల్‌నినో గురించి తెలిసి కూడా ప్రభుత్వం ప్రత్యమ్నాయ ప్రణాళికలెందుకు అమలు చేయలేదు, ఆరుతడి పంటలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు, ఈ కరెంటు కోతలేంటని చాలామంది ప్రశ్న. వ్యవసాయం గురించి, రైతుల గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఏం చెప్పారు? సీఎం అయ్యాక ఏం చేశారు?  ఇప్పుడు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమేంటి? కరవును ఎదుర్కోవడం, నష్టపోయిన రైతులకు పరిహారమివ్వడంలో ఇకనైనా కదలకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details