ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని - నింపిన ఉద్యోగాలు ఎన్ని? - ప్రతిధ్వని వివరాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 9:38 PM IST
Prathidhwani:రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని.. నింపిన ఉద్యోగాలు ఎన్ని? కొద్ది రోజులుగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ సంధిస్తున్న సూటి ప్రశ్న ఇది. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీ... నాలుగున్నరేళ్ల పాలనలో ఎంత వరకు అమలు చేశారన్నది చూసుకుంటే తమకు మిగిలింది, ఒరిగిందేంటన్నదే అందరిలో వ్యక్తం అవుతున్న నిర్వేదం. అసలు యువత, ఉద్యోగార్థులపై ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందా... ఏటా క్రమం తప్పకుండా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇన్నేళ్లుగా ఉద్యోగాలంటూ.. ఉసూరుమనిపిస్తున్న ఎన్నికల ముంగిట మళ్లీ నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేస్తున్న జగన్ సర్కార్‌ను జనం నమ్మేదెలా?
ఈరోజు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాల రాజధానుల్లో అధిక సంఖ్యలో ఆంధ్రా యువతే కనిపిస్తున్నారు. ఎందుకు ఆ మానవ వనరులను మన రాష్ట్రంలో ఉపయోగించుకోలేక పోతున్నాము? గత ప్రభుత్వంలో విశాఖలో, మంగళగిరి, విజయవాడల్లో పలు ఐటీ కంపెనీలను తీసుకుని వచ్చింది. వాటిల్లో చాలా కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. అమరావతిని అడ్డుకోవటంతో రాజధాని లేకుండా పోయింది. యువతకు ఉపాధి కల్పించటంలో ఈ పరిణామాల ప్రభావం ఏ మేరకు ఉండవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.