సోషల్ మీడియా గొంతునొక్కేలా సీఐడీ నిర్ణయాలు! - సోషల్ మీడియా గొంతనొక్కేలా సీఐడీ నిర్ణయాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 9:51 PM IST
prathidwani: భావప్రకటన స్వేచ్ఛ, సోషల్ మీడియాకు సంకెళ్లేసే సర్కారీ వ్యూహాలు పదును తేలుతున్నాయి రాష్ట్రంలో. అధికారపక్షంగా తామేం చేసినా ఓకే.., విపక్షాలు.., వారి మద్దతుదారులు ఏం చేసినా తప్పే! అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నరీతిలో సాగిపోతున్నాయి పరిణామాలు. సైబర్ బుల్లీ షీట్లు, ఆస్తుల జప్తు వంటి అంశాల్నీ తెరపైకి తెచ్చారు సీఐడీ అధిపతి. పరిధి దాటిన, అసభ్య పోస్టులను ఎవ్వరూ సమర్థించరు. చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అదే సమయంలో..., ఆ ముసుగులో... విపక్షాల్ని, వారిని సానుభూతిపరుల్ని వేధించడానికి, వారి అరెస్టులకు ఇదో ఆయుధంగా మారితే ఎలా? ఇదే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో పెట్టేది? ఇప్పుడు ఏం చేస్తోంది? ఒకప్పుడు అసభ్య పోస్టులు పెట్టినందుకు వైసీపీ సోషల్ మీడియా వారిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తే జస్టిస్ మార్కండేయ ఖట్జూ సహా అనేకమంది మేధావులు గగ్గోలు పెట్టారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతున్నా ఏ మేధావులూ ఎందుకు కిక్కురుమనట్లేదు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.