ఏపీలో గడువు కంటే ముందే ఎన్నికలు! పాలక- ప్రతిపక్షాల అనుకూల ప్రతికూల పరిస్థితులేంటీ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 9:51 PM IST
Prathidhwani:రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈసారి కాస్త ముందుగానే రావచ్చు, తెలంగాణలో మొన్న గడువు కంటే ముందే ఎన్నికలు జరిగాయి, అలాగే మనకూ షెడ్యూల్ ముందుకు రావచ్చని ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజంగానే వైఎస్ జగన్ చెప్పినట్లు ఏపీలో ఎన్నికలు ముందువస్తే ఏం జరుగుతుంది? ఏం చెప్పి మళ్లీ ఓట్లు అడుగుతారు? నాలుగున్నరేళ్ల పాలన అనుభవాలు ఏం చెబుతున్నాయి? జగన్ పాలన గురించి జనం ఏం అనుకుంటున్నారు?
ప్రతిపక్షనేత హోదాలో జగన్ వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ మ్యానిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీత అంత పవిత్రమైనదని చెప్పారు. మ్యానిఫెస్టోలో 98.5శాతం పూర్తి చేశామని ఈమధ్యే సీఎం ప్రకటించారు. నిజంగానే అవన్నీ అమలయ్యాయా? తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ కనీసం 40 నుంచి 50 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వట్లేదని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల దందాల మీదే వ్యతిరేకత ఉందా? లేక జగన్ పాలన మీద కూడా జనంలో వ్యతిరేకత కనిపిస్తోందా? ఇదీ నేటి ప్రతిధ్వని.