ఆంధ్రప్రదేశ్

andhra pradesh

prathidhwani

ETV Bharat / videos

Prathidwani: విశాఖలో పెరుగుతున్న నేరాలు-ఘోరాలు.. సామాన్యుల పరిస్థితి ఏంటి..? - కిడ్నాప్‌ల పై ప్రతిధ్వని

By

Published : Jun 15, 2023, 10:05 PM IST

Prathidhwani:నేరగాళ్ల పడగనీడలో వరస నేరాలతో విశాఖపట్నం ఉలిక్కి పడుతోంది. తరచూ.. హత్యలు, కిడ్నాప్‌లతో భయం నీడలా వెంటాడుతోంది. అసలు.. సిటీ ఆఫ్‌ డెస్టినీగా పిలుచుకునే సుందర విశాఖనగరంలో ఎందుకీ పరిస్థితి? మొన్న ఆదివారం రోజునే... వైకాపా పాలనలో అరాచక శక్తులకు, భూ కబ్జాలకు అడ్డాగా మారిందని ఘాటు విమర్శలు చేశారు.. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. అది జరిగిన స్వల్ప వ్యవధిలో సాక్షాత్ విశాఖపట్నం నుంచి అధికార వైకాపా ఎంపీ కుటుంబసభ్యులనే కిడ్నాపర్లు అపహరించారు. ఎంపీ కుటుంబానికే ఆ పరిస్థితి ఉంటే... విశాఖలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? 

 ప్రస్తుతం కేసులో నిందితుడిపైనే ఇప్పటికే 3 కిడ్నాప్ కేసులు ఉన్నట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వయంగా చెప్పారు. మరి ఇలాంటి వాళ్లను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఓవైపు సుందర విశాఖ తీరం, మరో వైపు ఉక్కునగరంతో సిటీ ఆఫ్‌ డెస్టినీగా ఉన్న విశాఖలో నేరాల తీవ్రత ఇంతగా ఎందుకు పెరిగింది? వైకాపా పాలనకు ముందు... వారి పాలనలో విశాఖ నగర ఇమేజ్ కానీ... సగటు ప్రజల జీవన విధానాన్ని గానీ మీరు ఎలా విశ్లేషిస్తారు?  విశాఖలోని 22 పోలీసు స్టేషన్లలో 350 నుంచి 400 మంది వరకు రౌడీషీటర్లు ఉన్నారని.. వారిని పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదనే వాదనలు ఉన్నాయి. రౌడీ మూకలకు ఎందుకంత ధైర్యం... ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details