ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani

ETV Bharat / videos

Prathidhwani: జగనన్న పాలనలో రాష్ట్రానికి కరెంట్ కష్టాలు - ఏపీలో విద్యుత్ ఛార్జీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 9:42 PM IST

Prathidhwani: జగనన్న కరెంటుషాకులు.. ప్రజల్ని తీవ్రంగా కలవర పెడుతున్న అంశం ఇది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులపై ఏటా జగన్ సర్కారు మోపిన 10,403 కోట్ల రూపాయల భారమే ఇందుకు సాక్ష్యమంటూ వాపోతున్నాయి ప్రజాసంఘాలు, విపక్షాలు. వాడిన విద్యుత్తు కన్నా వివిధ పేర్లతో పిండేస్తున్న అదనపు బిల్లులు చెల్లించలేక తల్లడిల్లుతున్నవారి కష్టాల్ని కనీసం పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నాడు. అసలు... ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రభుత్వం వచ్చాకా ఎందుకు పదేపదే విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నారు? గత ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తానని చెప్పారు. అలాంటి పరిస్థితుల నుంచి నేటి వాతలు, కోతలకు కారణం ఏమిటి? దిద్దుబాటు ఎలా? రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంథకారం అవుతుందని, తీవ్ర కరెంటు కష్టాలు చుట్టుముడతాయని నాడు చాలామంది ఆంధ్రా నాయకులు మాట్లాడారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కరెంటు కష్టాలు రానివ్వకుండా గృహ వినియోగానికి, పరిశ్రమలకు కావాల్సిన కరెంటు ఇస్తోంది. మిగులు విద్యుత్ ఉన్న ఏపీకి ఎందుకీ దురవస్థ దాపురించింది?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details