prathidhwani: అధికార పార్టీ దోపిడీకి కనుమరుగవుతున్న విశాఖ అందాలు
prathidhwani: అధికార పార్టీ పెద్దలు, ఆ పార్టీ నేతలు తలుచుకుంటే కొండలైనా.. బోడిగుండులై పోవాల్సిందే. అత్యంత అరుదైన భౌగోళిక వారసత్వ సంపదలైనా.. ఉనికే ప్రమాదంలో పడి బిక్కుబిక్కుమనాల్సిందే. రుషికొండకు గుండుకొట్టి ఎర్రమట్టి దిబ్బల్ని నాశనం అంచులకు నెట్టిన ఈ నిర్వాకాలకు మౌనసాక్షిగా నిలుస్తోంది విశాఖ నగరం. ఒకప్పుడు ప్రకృతి అందాలు, వారసత్వ సంపదలు, ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరైన.. సిటీ ఆఫ్ డెస్టినీలో నాలుగేళ్లుగా ఇలాంటి దుమారాలతో వార్తల్లో నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. విశాఖలో వివాదం అవుతున్న మరో విషయం ముడసర్లోవ పార్కు ప్రైవేటీకరణ. ఈ నిర్ణయంపై కౌన్సిల్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా ముందుకే వెళ్తున్నారు.. ఎందుకు? దానివల్ల నష్టమేంటి? విశాఖను ఆనుకుని చాలాచోట్ల అభివృద్ధి, సుందరీకరణ పేరుతో జరుగుతున్న కార్యకలాపాల్లో సీఆర్జెడ్ ఉల్లంఘనలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతల కనుసన్నుల్లోనే విశాఖలో సాగుతున్న విధ్వంసం ఎంతవరకు.. అన్నదే ఇప్పుడు పర్యావరణవేత్తల్ని తొలిచి వేస్తున్న ప్రశ్న. గతంలో ఎన్నడూ లేని రీతిలో విశాఖ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మూలకారణం ఏమిటి? ఎవరిది బాధ్యత? ఒకవేళ ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో నగరం భవితవ్యం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.