Prathidhwani: ఓటర్ల జాబితాపై ఐదో సారి ప్రత్యేక సమగ్ర సవరణ.. ఆదమరిచారో అంతే...
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 10:45 PM IST
Prathidhwani: టస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తీసివేతకు అధికార వైసీపీ ఏఏ రూపాల్లో ప్రయత్నిస్తోంది? ప్రజలు ఏఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 4సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారు. ప్రస్తుతం 5వ సారి ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. ఇప్పటికీ జాబితాలో అక్రమాలు, అవకతవకలు కొనసాగుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ఓటరు జాబితాలో అక్రమాలపై విపక్షాలుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఈసీకి ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కేసులు వేశారు. మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదులు చేశారు. అయినా ఇప్పటికీ లక్షలసంఖ్యలో అనుమానాస్పద ఓట్లున్నప్పుడు మన ముందున్న మార్గమేంటి? ఎన్నికలనేవి ఎప్పుడైనా రావొచ్చు. ఆ ప్రకటన ఎప్పుడు వస్తే అప్పటికి ఉన్న ఓటరు జాబితాలతో ప్రక్రియ నిర్వహించడం మినహా మరోమార్గం ఉండదు. అలాంటి పరిస్థితుల్లోఅనుమానాస్పద, బోగస్ ఓట్ల ప్రక్షాళన విషయంలో విపక్షాల ముందు ఉమ్మడిగా ఉన్న తక్షణ కర్తవ్యమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.