Prathidhwani: నిధుల "పంచాయతీ"... కేంద్రం కన్నెర్ర - ఏపీలో పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ బృందం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 9:38 PM IST
Prathidhwani: రాష్ట్రంలో పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వస్తోన్న వందలు, వేల కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయి? సర్పంచ్‌లకు కనీసం మాట చెప్పకుండా మళ్లిస్తున్న నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మా నిధులు దోచుకుంటున్నారు మహప్రభో అని గ్రామపెద్దల ఆవేదన... కరెంట్ బిల్లులకు సర్దుబాటు చేశామంటున్న ప్రభుత్వ సమర్థనల్లో ఏది నిజం? ఒకవేళ కరెంటు బిల్లులకే తీసుకుని ఉంటే ఆ రశీదులు ఎక్కడ? రోడ్లపై ఆందోళనలు చేస్తున్న సర్పంచ్‌లో.. వారికి బాసటగా నిలుస్తున్న విపక్షాలో కాదు.. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ బృందం ప్రశ్నలివి. ఈ వ్యవహరంలో ఇకపై కేంద్రం చర్యలు ఎలా ఉండబోతున్నాయి? నాలుగున్నర సంవత్సరాల్లో అసలు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నుంచి మళ్లించిన నిధులు ఎంత? దీనిపై ఎంతోకాలంగా సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళనలకైనా ప్రభుత్వం సమాధానం చెప్పిందా? రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక కూడా స్థానికసంస్థల్లో రాష్ట్రప్రభుత్వం మితి మీరి జోక్యం చేసుకుంటోందని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలోకి తొక్కుతోందని అక్షింతలు వేసిన నేపథ్యంలో రాష్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నేటి ప్రతిధ్వని.