Prathidhwani: జగనన్న నాలుగేళ్ల పాలనలో పేదలకు దక్కిన సంక్షేమం ఎంత?
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు దక్కిన సంక్షేమం ఎంత? అధికారంలో వచ్చిన నాలుగేళ్లలో.. ఇచ్చిన హామీలు, చేసిన బాసలు అదే స్ఫూర్తితో అమలు చేస్తున్నారా? అదే నిజం అయితే పింఛన్ల నుంచి అమ్మఒడి వరకు... సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ పెద్దలు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంత ఉందా? తనది పేదల ప్రభుత్వం అని, పెత్తందార్లతో పోరాటం చేస్తున్నానని ప్రతి సభలో పదేపదే అనే సీఎం నిజంగా వారి కష్టాలు పట్టించుకుంటున్నారా?
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా.. పింఛను లేదు, పథకాలు అందడం లేదని ఎంతోమంది గోడు వెళ్లబోసుకున్నారు. పింఛన్ల నుంచి అమ్మఒడి వంటి పథకాల వరకు.. లబ్దిదారుల జాబితాల్ని సిక్స్‌స్టెప్ వెరిఫికేషన్ పేరిట కోసేస్తున్నారన్నది చాలామంది ఆవేదన. ఏ కారణాలతో ఉన్నవాళ్లని తీసేస్తున్నారు ? ఇవి చాలవన్నట్లు... ప్రభుత్వ సమావేశాలకు రాకపోయినా... అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయక పోయినా పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు దిగుతుండడాన్ని ఎలా చూడాలి. ఇలాంటి విషయంలో పౌరసంఘాల స్పందన ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.