ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిధ్వని

ETV Bharat / videos

prathidhwani: రాష్ట్రంలో బతుకు తెరువు కరువు.. పక్క రాష్ట్రాల వైపు యువత పరుగు... - నిరుద్యోగ సమస్యలపై ప్రతిధ్వని

By

Published : May 8, 2023, 10:11 PM IST

prathidhwani: ఉన్నఊరు, కన్నబంధాలు.. ఇవన్నీ వదులుకుని గుండె రాయి చేసుకుంటే తప్ప జీవితాల్లో స్థిరపడే దారులు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం కావాలి అంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాలి. లేదంటే నిరుద్యోగిగా మిగిలిపోవాలి. కారణం... రాష్ట్రంలో పెద్ద నగరమంటూ లేదు.. ఐటీ కంపెనీలు రావు.. ప్రభుత్వం ప్రోత్సాహం అందించదు. పరిశ్రమలు తీసుకొచ్చి, ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోదు. ఫలితం.. ఇతర రాష్ట్రాలకు ఉద్యోగులను అందించే రాష్ట్రంలా ఏపీ మారిపోయింది. అసలు ఏపీ నుంచి ఎందుకీ మేథో వలసలు? రాష్ట్ర అభివృద్ధిలో వారిని ఎందుకు భాగస్వాములను చేయలేకపోతున్నాం? జాతీయ సగటు కంటే నిరుద్యోగ పట్టభద్రులు ఏపీలోనే రెండింతలు అధికంగా ఉన్నారు. 3 ఏళ్లలో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు 10% పైగా పెరిగినట్లు తాజాగా  సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ (సీఎంఐఈ) నివేదిక బహిర్గతం చేసింది. ఈ అంశాలన్ని దేనికి సంకేతం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

ABOUT THE AUTHOR

...view details