ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani

ETV Bharat / videos

జగన్ ఏం హామీలు ఇచ్చారు ? సీఎం అయ్యాకా వైఖరి ఎలా మారింది ? - సమస్యలపై నేటి ప్రతిధ్వని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 10:35 PM IST

Prathidhwani: ఆంధ్రప్రదేశ్‌ ఆందోళన ప్రదేశ్‌గా మారింది. సామాన్యులు గళం విప్పుతున్నారు. నాలుగున్నరేళ్ల నియంత పాలనను ఎదిరించటం తప్ప మరో దారి కనిపించని జనాలు కదనోత్సాహంతో సమ్మె జెండాను ఎగరేస్తున్నారు. అంగన్‌వాడీలు, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికుల దారిలోనే వివిధ తరగతుల ఉద్యోగులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు కూడా పోరాట పథం వైపు అడుగులు వేస్తున్నారు. ఆశా, విద్యుత్‌, కెజిబివి, పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా గొంతెత్తి జగన్‌ సర్కార్‌ మోసపూరిత విధానాలను ప్రశ్నిస్తున్నారు. అసలు వివిధ వర్గాలకు జగన్ ఏం హామీ ఇచ్చారు? సీఎం అయ్యాకా ఆయన వైఖరి ఎలా ఉంది? నిరుద్యోగులు మంత్రి బొత్స క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించి అరెస్ట్ అయ్యారు కూడా. వారి ఆందోళనలకు కారణం ఏంటి ? వారి సమస్య పరిశీలించటానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందా ? ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా తరచూ ఆందోళన బాట పడుతున్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం పాటుపడిన తమకు అన్యాయం చేయటం బాధాకరమని వారిలో చాలామంది వివిధ సందర్బాల్లో చెప్పారు. వారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అంత దారుణంగా ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని 

ABOUT THE AUTHOR

...view details