ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani

ETV Bharat / videos

Prathidwani: పౌరుడి ఓటు తీసేయడం, దొంగ ఓట్లు చేర్చడం ఇంత ఈజీనా?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 10:17 PM IST

Prathidhwani: స్వయానా ఒక మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి, అది కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన వ్యక్తి రాష్ట్రంలో ఓటు హక్కు కోసం మూడేళ్లుగా పోరాడుతున్నారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి నచ్చకపోతే కనీసం ఓటు హక్కు పొందడం కూడా అంత కష్టమా?  అర్హులైన వారు ఎవరికైనా ఓటు కావాలంటే ఎలక్షన్‌ కమిషన్‌ను అడుగుతారు. ఎంతోమందిని బతికి ఉండగానే చంపేస్తున్నారు. చనిపోయిన వారి పేర్ల మీద... ఒకే డోన్‌ నంబర్‌ పైన, అసలు డోర్‌ నెంబరే లేకుండా వందల ఓట్లు చేర్చారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితాపై నియంత్రణ ఉందా? ఎవరి కనుసన్నల్లో ఇదంతా జరుగుతోంది?  కొంతకాలంగా ఉన్న వరస ఫిర్యాదులతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్‌ 21 నుంచి నెల రోజుల పాటు రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేపట్టారు. కనీసం అదైనా సక్రమంగా చేశారా? ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టిన నెల రోజుల తర్వాత ఏమిటి పరిస్థితి?  అసలు... ఒక పౌరుడి ఓటు తీసేయడం, దొంగఓట్లు చేర్చడం ఇంత ఈజీనా? ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిరక్షరాస్యులు, 10 పాస్‌ కానోళ్లని కూడా పట్టభద్రులుగా ఓట్లు వేయించారన్న ఫిర్యాదులు చూశాం. విపక్షాల రాజకీయ భవితవ్యంపై ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఓటర్ జాబితా అక్రమాలపై విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం లేదా? ఆ ఓట్లు వైకాపాకు పడవు అనుకున్నచోట్ల తొలగింపు దరఖాస్తులు పెట్టమని మంత్రులే చెబుతున్న తరుణంలో ఈ ప్రమాదాన్ని ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కోవాలి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details